12-11-2025 12:06:12 AM
ఆలయ పనులకు శ్రీకారం
ఎల్లారెడ్డి, నవంబర్ 11,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి పనులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి, పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు కోరిన సీసీ రోడ్ నిర్మాణం, పరిసరాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్మోహన్ మాటిచ్చిన వారం రోజుల్లోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవడం భక్తుల్లో ఆనందం కలిగించింది.
ఆలయ పరిసరాలు భక్తుల రాకపోకలకు అనువుగా మారేలా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు మదన్ మోహన్ మాత్రమే అని అభిప్రాయపడ్డారు. ప్రజల అభ్యర్థనలకు తక్షణ స్పందనతో ప్రజల మనసులు గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.