12-11-2025 12:04:39 AM
-‘విజిలెన్స్’ దాడులు ఎక్కడ?
-రైతుల్ని దోచేస్తున్నా రైస్ మిల్లు యజమానులు
-తరుగు పేరిట దోపిడి తేమ పేరిట రైతులకు కుచ్చటోపి
-విజిలెన్స్ అధికారుల అండదండలు రైస్ మిల్ యజమానులకు..?
-బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ నర్సిల్లబాద్ రుద్రూర్ వర్ణి కోటగిరి రైస్ మిల్లులో ఇష్టారాజ్యం...?
-ఇప్పటికైనా విజిలెన్స్ దాడులు జరిపి రైతులకు న్యాయం చేసేనా..
బాన్సువాడ, నవంబర్ 11 (విజయ క్రాంతి): రైస్ మిల్లర్లు రైతుల నిండా ముం చుతున్నారు. తరుగు పేరిట నిలువు నా... దోచేస్తున్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను నానా సాకులు చెబుతూ అన్న దాతలను మోసం చేస్తున్నారు. ఉమ్మడి నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లలాగడాలు మితిమీరి పోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యాన్ని తరలించినప్పటికీ కొనుగోలు చేసే పరిస్థితి లేక రైతులు అగచాట్లు పడుతున్నారు.
రైస్ మిల్లర్ల పై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలు స్తోంది. అధికారుల అండదండలతోటే ఈ తతంగం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, రైస్ మిల్లర్లు రైతులను వేధించడం మాత్రం ఆపడం లేదు. ట్రేడింగ్ నాట్ ట్రేడింగ్ రైస్ మిల్లులు కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ, ట్రేడింగ్ రైస్ మిల్లులు మాత్రం ధాన్యం కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తు న్నారు.
ధాన్యం తడిసిందని, వడ్ల రంగు మారిందని రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు అన్నదాతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తరలించినప్పటికీ, వాటిని రైస్ మిల్లు లోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా రోజుల తరబడి వాపోతున్నారు. బీర్కూర్, నసురుల్లాబాద్, రుద్రూర్ ప్రాంతాలకు చెందిన రైస్ మిల్లుల యాజమాన్యాలు రైతుల పట్ల మోసపూరిత వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు కర్షకులు కంటనీరు పెడుతున్నారు.
రైస్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు జరిగినా...
రైస్ మిల్లర్ల ఆగడాలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులు దృష్టి సాధించినట్లు తెలుస్తుంది. రైతులను ఇబ్బంది పెడుతున్న విషయాలను పరిగణలోకి తీసుకుని మిర్రర్లు చేస్తున్న తీరుతెనులపై ఆరా తీసినట్లు సమాచారం. ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మి ల్లింగ్ అనంతరం పౌరసరఫరాల శాఖకు సరఫరా చేసేందుకు అనుమతులను జారీ చేసింది. కానీ మిల్లర్లు రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని తామే స్వయంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో పలు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు మిల్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.
మీడియాకు నయానా.. భయానా..
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్లు తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను సైతం లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమాలు బయట రాకుండా మీడియాలో కథనాలు వెలువడకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధులను నయానో భయానో అప్పజెప్తూ తమ దందాలు కొనసాగించుకునేం దుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కూడా విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లింది.
విలేకరులను మచ్చిక చేసుకుని రైస్ మిల్లర్లు తమ వ్యాపారాలను ఏలాంటి అడ్డంకులు రాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బీర్కూర్, నసరులబాద్, రుద్రూర్ ప్రాంతాలకు చెందిన ట్రేడింగ్ రైస్ మిల్లుల యజమానులు పై విధంగా ప్రయత్నాలు చేస్తూ, ఇటు మీడియాను, అటు అధికారులను తలా పాపం తిల పిడకడన్న చందంగా అప్పజెప్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు సైతం సహకారాన్ని అందిస్తున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. మిల్లర్ల యజమానులపై విజిలెన్స్ అధికారులు ఎలాంటి చర్యలకు పాల్పడతారో..వేచి చూడాల్సిందే.