calender_icon.png 28 January, 2026 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగణమన గీతం అయినా కనీసం ఆగకుండా పాడగలవా...?

28-01-2026 09:04:18 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీప్ విప్ గా పనిచేసిన వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కనీసం జనగణమన గీతం ఆగకుండా పాడగలవా..! అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లకు 26 కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని, ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు కేవలం డిపాజిట్లు కాపాడుకోవడానికి మాత్రమే పోరాడుతారని అన్నారు.

ఎమ్మెల్యేగా గత ప్రభుత్వంలో చీప్ విప్‌గా పనిచేసిన వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. గతంలో వినయ్ భాస్కర్ ఏమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటే ప్రజలను,కులాలు మతాల పేరిట రెచ్చగొట్టి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటికి మొన్న భద్రకాళి గుడి సమీపంలోని గుడిసె వాసుల దగ్గరికి వెళ్లి వాళ్ళని రెచ్చగొట్టి,వాళ్లు రెచ్చిపోతే అక్కడికి కేటీఆర్ ను తీసుకువచ్చి షో చేద్దాం అనుకున్నారు.

కేటీఆర్ వరంగల్ కు రావాలి. వస్తే హనుమకొండ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వర్గానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏం చేసిందో చర్చ పెడదామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇవి శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకన్న, మామిండ్ల రాజు, విజయశ్రీ రజాలి, రవీందర్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, బంక సంపత్, పెరమండ్ల రామకృష్ణ, వీసం సురేందర్ రెడ్డి, రహి మునిసా బేగం తదితరులు పాల్గొన్నారు.