28-01-2026 09:06:53 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): కిరాణా దుకాణానికి వెళ్ళిన వృద్ధుడు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ చారి తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్ గాంధీ నగర్ కాలనీ,జవహర్ నగర్ లో నివాసముండే నిశాంత్ కుమార్, తన తల్లి మరణించిన తర్వాత, 74 సంవత్సరాల వయస్సు గల తన తండ్రి మహేశ్వర్ దాస్‌ను రెండు నెలల క్రితం తనతో ఉండటానికి బీహార్ నుండి నగరానికి తీసుకువచ్చాడు. ఈ 26 న సోమవారం ఉదయం తన తండ్రి కాలనీలోని కిరాణా దుకాణానికి వెళ్లడానికి ఇంటి నుండి బయలుదేరాడు మరియు తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బంధువుల ఇళ్లలో వెతికిన ఎలాంటి ఆచూకీ లభించలేదు దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.