calender_icon.png 28 January, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటలు ప్రారంభోత్సవం

28-01-2026 07:56:29 PM

మోతె,(విజయక్రాంతి): యువకులలో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయడానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని మోతె మండల అభివృద్ధి అధికారి ఆంజనేయులు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామవరం లో సి.ఎం.కప్ మండల స్థాయి క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలలో మరుగున పడిపోయిన క్రీడలను మెరుగు పరచడానికి గాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీలు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహించబడుతాయని అన్నారు.

మండల స్థాయి క్రీడలలో మండలంలోని వివిధ గ్రామాల క్రీడల జట్టులు పాల్గొన్నాయి.  కబడ్డీ, వాలీబాల్, కో కో పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దైద శ్రవణ్,మండల ఎం. పి. ఓ. కృష్ణవంశీ,మండల విద్యాధికారి గోపాల్ రావు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఎల్. ఎన్. చారీ,మండల వ్యాయామ ఉపాధ్యాయులు కోటేశ్వర్ రావు, నాగేశ్వర్ రావు, రేణుక, గురులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.