31 May, 2026 | 9:04 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్

26-02-2026 03:20 PM

దేవరకొండ, విజయక్రాంతి: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్) ఆధ్వర్యంలోదేవరకొండ పట్టణంలో  స్థానిక స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్(Devarakonda MLA Nenavath Balu Nayak) ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతలో సామాజిక బాధ్యతాభావం, సేవా గుణం మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా, టీమ్‌వర్క్, క్రమశిక్షణ (డిసిప్లిన్), ఆత్మవిశ్వాసం వంటి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

యువత ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రధాన శక్తి అని పేర్కొన్న ఆయన, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయని, యువత స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహ, నేరేడుగొమ్ము మాజీ ఎంపీపీ బిక్కు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ పాప నాయక్, మాజీ కౌన్సిలర్ జయప్రకాష్, సర్పంచులు కొర్ర రాంసింగ్, బాబురాం నాయక్, లక్పతి, రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.