20 August, 2026 | 10:17 PM

రూ.9 కోట్లతో డబుల్‌ రోడ్డుకు శంకుస్థాపన

20-08-2026 09:41 PM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ,(విజయక్రాంతి): రామలక్ష్మీపురంలో మిర్యాలగూడ కోదాడ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి హుజూర్‌నగర్‌ బైపాస్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రూ.9 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే పరిసర ప్రాంత ప్రజల ప్రయాణాలు వేగవంతం, సులభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు శరభేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డి, గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి తులిశమ్మ కన్నారెడ్డి, రాష్ట్ర కౌలు రైతు ఉపాధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రామాలయం చైర్మన్ సుబ్బారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సుభాష్ రెడ్డి, చిన్న వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ సీతారాములు, రైతులు పాల్గొన్నారు.