17 April, 2026 | 11:57 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

నిబద్ధతతో ప్రజాసేవ చేయండి

28-02-2026 02:12 AM

మహబూబ్‌నగర్ పాలకవర్గానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి సూచన

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మేయర్ గుమాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డిని, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పారదర్శకంగా, అభివృద్ధి దిశగా, ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.