9 April, 2026 | 10:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

16-02-2026 12:41 AM

కొల్చారం, ఫిబ్రవరి 15 : జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బిఆర్‌ఎస్ యువజన వి భాగం మండల శాఖ అధ్యక్షులు తణుకులపల్లి సంతోష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదివారం ప్రారంభించారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై జంక్షన్ వద్ద తాగునీరు అందించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని యువజన విభాగం మండల నాయకులు చలివేంద్రం విజయవంతంగా వేసవేమోసే వరకు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, డిసిఎంఎస్ మాజీ ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సర్పంచుల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు రవితేజ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్ల ఆంజనేయులు ఏడుపాయల ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్లు గౌరీ శంకర్, యాద గౌడ్, సీనియర్ నాయకులు ముత్యం ప్రవీణ్, కాశీనాథ్, సర్పంచులు నెల్లీ సంగమేశ్వర్, అరిగే స్వర్ణలత విజయ్, కురబోయిన లక్ష్మి, రంగంపేట ఉపసర్పంచ్ చిట్కుల సురేష్, టిఆర్‌ఎస్వి నాయకులు సురేష్ గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.