9 April, 2026 | 8:49 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

‘మేళ్లచెర్వు-హైదరాబాద్’ రైలు

16-02-2026 12:42 AM

ప్రణాళికలు రూపొందిస్తున్నాం

  1. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  2. ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర దేవస్థానంలో పూజలు

హుజూర్‌నగర్(మేళ్లచెరువు), ఫిబ్రవరి 15: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు నుంచి హైదరాబాద్‌కు ప్యాసింజర్ రైల్వే మార్గం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మేళ్లచెర్వు గ్రామంలోని ఇష్ట కామేశ్వరి సమేత స్వయం భూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంతో తనకు మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉన్నదన్నారు. మేళ్లచెర్వు తనకు మానస పుత్రిక లాంటిదని తాను, ప్రజా జీవితంలో పనిచేసిన సుదీర్ఘ కాలంలో ఈ ప్రాంత ప్రజలకు కృష్ణా నది నుంచి తాగు, సాగు నీరు రప్పించడం తీరని సంతృప్తినిచ్చిందన్నారు.

దేవదేవుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, సకాలంలో కురిసిన వర్షాలతో రైతాంగానికి జరిగిన మేలు ఎప్పటికీ కొనసాగాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కుడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తోడ్పాటుతో కోటి రూపాయల నిధులు విడుదల చేయించింనట్లు వెల్లడించారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మేళ్లచెర్వుకు గతంలో తానే కేంద్రంతో మాట్లాడి రైల్వే లైన్ ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండి తరలి వస్తున్న భక్తులతో పాటు ఇక్కడి ప్రజల సౌకర్యార్థం మేళ్లచెర్వు నుంచి హైదరాబాద్ వరకు డబుల్ రైల్వే లైన్ ఏర్పాటు చేసి ప్యాసింజర్ రైల్‌ను ఏర్పాటు చేసుబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.