calender_icon.png 12 February, 2026 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలింగేశ్వరున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు

12-02-2026 12:52:46 PM

శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 

షాద్‌నగర్,(విజయక్రాంతి): శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల లో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మహిమానిత్వమైన, స్వయంభూ లింగం శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆయన సతీమణి అనురాధ దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం రామేశ్వరంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

ఆలయ నిర్వహణ అధికారి శివ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకర్ దంపతులతో స్వామి వారికి అభిషేకం చేయించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట లింగారెడ్డిగూడెం ఉపసర్పంచ్ ఎర్రోళ్ల అశోక్  మంకాళి శ్రీశైలం  కాంగ్రెస్ నేతలు అగ్గనూరు బస్వం, చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చల్లగా చూడు శివయ్య 

ఈ లోకాన్ని చల్లగా చూసే స్వామి ముక్కంటి శివయ్య అని ఆయన ఆశీసులు భక్తులపై ఎల్లవేళలా ప్రసరిస్తాయని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆయన కరుణా కటాక్షాలతో ప్రభుత్వం ప్రజలను చల్లగా పాలిస్తుందని అన్నారు. శివరాత్రి మహాదిన పర్వాన బ్రహ్మోత్సవాలు ప్రభుత్వ అత్యంత వైభవంగా నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ అనురాధ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ఆయనను సన్మానించారు.

18 వరకు  బ్రహ్మోత్సవాలు

ఫరూక్ నగర్ మండలం రామేశ్వరంలో ఈనెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయనీ ఆలయ కార్య నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి మొదటి రోజు గణపతి పూజ, రుద్ర హోమం, ధ్వజారోహణం ప్రతిష్ట తదితర కార్యక్రమాలు ఉంటాయి. 12వ తేదీన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. 13న నంది సేవ, అగ్ని గుండాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.

14న రుద్రాభిషేకం, విశేష అలంకరణ నిర్వహిస్తారు. 15వ తేదీన మహాశివరాత్రి ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. 16న రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. 17వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. 18న శివతీర్థంతో కార్యక్రమాలు ముగుస్తాయని నిర్వాహకులు వెల్లడించారు ‌. భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.