7 April, 2026 | 6:39 PM

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం

07-04-2026 04:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును, సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలతను నిలువెత్తుదండతో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పదో వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.