మాసానిపల్లి గ్రామంలో యాసంగి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను మండలంలోని మాసానిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి, ఆధ్వర్యంలో ఐకెపి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు యాసంగిలో ఆరుకాలం కష్టపడి సాగు చేసిన వరి పంటను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించి రైతులకు లాభదాకారమైన మద్దతు ధర పొందాలన్నారు.బయట దళారులకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని,రైతులకు ఎల్లప్పుడూ వెన్నంటూ ఉండి రైతుల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి, మాజీ సర్పంచులు అంజాగౌడ్, విట్టల్, రైతులు బొల్లారం రాజు, మల్కారెడ్డి, కిష్టయ్య, నరేందర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, మైపాల్ రెడ్డి, మల్లయ్య, భాస్కర్ రెడ్డి, బాలు, వినోద్, శ్రీనివాస్, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.




