02-02-2026 12:23:21 AM
ఆయిజ ఫిబ్రవరి 1: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీలోని మద్దిలేటి నరసింహస్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో జరుగు శ్రీశ్రీశ్రీ మద్దిలేటి లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన అలంపూర్ శాసన సభ్యులు విజయుడు.అంగరంగా వైభావంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని దేవస్థాన కమిటీవారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ ఆయిజ మండల ఇంచార్జ్ రంగారెడ్డి, సీనియర్ నాయకులు వేమారెడ్డి, మాజీ కౌన్సిలర్ సి ఏం సురేష్, నాగన్నగౌడ్,ఉండేకారి మల్లయ్య మరియు ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.