15 March, 2026 | 7:41 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కేంద్ర బడెట్‌లో తెలంగాణకు అన్యాయం

02-02-2026 12:23 AM

ప్రభుత్వ విప్  శ్రీనివాస్

వేములవాడ, ఫిబ్రవరి 1,(విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర అవసరాలపై పలుమార్లు విన్నవించినప్పటికీ కేటాయింపులు లేకపోవడం బాధాకరమన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మూసీ అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఈ బడ్జెట్ కా ర్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ఉండి, సామాన్యులకు ప్రయోజనం లేకుండా ఉందన్నారు.

బయో ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ముందున్న తెలంగాణకు ప్రస్తావన లేకపోవడం, క్రీడారంగానికీ నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు.తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.