27 August, 2026 | 6:19 PM

శంషాబాద్‌లో ఎమ్మెల్యే మేనకోడలు వివాహ వేడుక

27-08-2026 03:11 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి

శంషాబాద్‌, ఆగస్టు 27(విజయక్రాంతి): శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మేనకోడలు వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ వివాహ వేడుకకు షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.