27 August, 2026 | 6:36 PM

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి

27-08-2026 03:09 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా అంకుసాపూర్, తుంపల్లి, గోవింద్‌పూర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇంచార్జి శ్యాంనాయక్, సర్ కోఆర్డినేటర్ రాంభోపాల్ హాజరు అయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు పరిశీలించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా , మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, డీసీసీ ఉపాధ్యక్షుడు తరిఖ్, సర్పంచులు టెకం గంగారాం, టెకం ఈశ్వరిబాయి, లక్ష్మి చరణ్, బీఎల్‌ఏలు ప్రభాకర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.