ఎమ్మెల్సీ మధును పదవి నుంచి తొలగించాలి
- వికారాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ
- కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
వికారాబాద్, సెప్టెంబర్- 8తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను వికారాబాద్ డిసిసి అధ్యక్షులు ధారసింగ్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎమ్మెల్సీ తాత మధు మాటలకు నిరసనగా వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు రెండు వేల మందితో పెద్ద ఎత్తున నిరసన తెలిపి అనంతరం బీఆర్‌ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. బ్లాక్ టీ షర్ట్లు ధరించి నిరసన తెలపడం తప్పు కాదని అయితే టీ షర్టులపై నినాదాలు రాతలు రాసుకొని అసెంబ్లీకి రావద్దని స్పీకర్ సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్ సూచనలను తప్పక అర్థం చేసుకొని దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యక్తికి మాత్రమే కాకుండా స్వీకరణ రాజ్యాంగబద్ధమైన పదవి పదవికి గౌరవం ఇవ్వాలని ధారసింగ్ తెలిపారు. తాత మధు మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు కూడా సమన్వయం పాటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలను ధారసింగ్ సవాల్ విసిరారు.
ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ పనితీరుపై చర్చించాలని అన్నారు. 119 నియోజకవర్గాలలో ఎక్కడైనా ప్రజల ముందు వచ్చి అభివృద్ధి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతోపాటు అవసరమైన సూచనలు ఇవ్వాలని అన్నారు.
మంచి సూచనలు చేస్తే ప్రభుత్వం వాటిని స్వీకరించి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక దళితుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న సమయంలో ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని ధారసింగ్ అన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని నాయకులు అసెంబ్లీ పంపడం కాకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. మహిళా ప్రజా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ చేస్తున్న ఆరోపణలు కూడా ధారాసింగ్ ఖండించారు.
పోలీసులు తమ విధులను బాధ్యత నిర్వర్తించారని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య మాట్లాడుతూ తన తండ్రి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ను అవమానించిన ఆయన స్పందించకుండా సoమయనం పాటించడం ఆయన సంస్కారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లో స్పీకర్ ముందు నిబంధనలకు,రూల్స్ అనుగుణంగా వ్యవహా రించాల్సిన అవసరం ఉంటుందని చైర్ పర్సన్ అన్నారు. స్పీకర్ పై దుర్భాషలో మాట్లాడడం తగదని హితువు పలికారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని వ్యక్తిగత దూషణలకు మాత్రం పాలు పడబోమని స్పష్టం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు.
తన తండ్రిని ఉద్దేశించి చేసిన వాక్యాలు తమ కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అనే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశ్వనాథం సత్యనారాయణ,మైపాల్ రెడ్డి, రామచంద్ర రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి, చిగుర్లపల్లి రమేష్ కుమార్, కిషన్ నాయక్ ముత్తహరి షరీఫ్ ఆయా మండలాధ్యక్షులు సర్పంచులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.