20 May, 2026 | 2:46 AM

ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలో సందర్శించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

20-05-2026 12:00 AM

ఘట్ కేసర్, మే 19 (విజయ క్రాంతి) :  ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్  వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు పరిష్కరించాల్సిన వివిధ పారిశుధ్య సమస్యలపై సంబంధిత సెక్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం ఘట్కేసర్ డివిజన్ ఎన్‌ఎఫ్సీ నగర్లో కొనసాగుతున్న జనగణన  ప్రక్రియను పరిశీలించారు.

అలాగే (శానిటరీ వర్కర్స్ గ్రూప్) కార్మికులతో సమావేశమై, వారి సంక్షేమం, భద్రత దృష్ట్యా అవసరమైన అన్ని సేఫ్టీ గేర్ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎదులాబాద్ డివిజన్ లోని ప్లేగ్రౌండ్ను సందర్శించి, అక్కడ క్రీడాకారులు,  స్థానిక ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈకార్యక్రమంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, ఇంజనీరింగ్ విభాగం డిఈ నరేష్, శానిటేషన్ విభాగం డిఈ శ్రీనివాస్, ఏడబ్ల్యుఈ చంద్రశేఖర్ సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.