16 April, 2026 | 9:49 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అవినీతి రహిత పాలన దిశగా 'మోడీ' పాలన

06-04-2025 04:31 PM

పెన్ పహాడ్: భారతదేశంలో బీజేపీ రాకతో మోడీ హేట్రిక్ పాలనలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని బీజేపీ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి మధు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు.  రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రాపర్తి వెంకన, తాడోజు జనార్ధనా చారి, మారోజు నాగేంద్ర చారి, గుడపురి శ్రీను, అరె ప్రభాకర్, చామకూరి వెంకటేష్ ఒగ్గు వినోద్, పవనగంటి సతీష్ చారి, చిన్నపంగి నాగరాజు, చిత్రం శ్రీకాంత్, కత్తి లక్ష్మయ్య, ఒగ్గు రాములు తదితరులు ఉన్నారు.