10 April, 2026 | 5:22 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

రాజ్ పాకాలకు మోకిల పోలీసుల నోటీసులు..

28-10-2024 12:21 PM

హైదరాబాద్: నగర శివారులోని జన్వాడలో వ్యాపారి రాజ్ పాకాల ఫాంహౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ పాకాలకు మోకిల పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఫాంహౌస్ పార్టీ కేసులో ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇవాళ విచారణకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. రాజ్ పాకాలకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్, కేసు సంబంధిత ఆధారాలు సమర్పించాలని పోలీసులు వివరించారు. విచారణకు రాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వెల్లడించారు.