10 April, 2026 | 3:21 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

జగన్ జైలుకెళ్లడం ఖాయం: యనమల రామకృష్ణుడు

28-10-2024 12:39 PM

జగన్ చేయి పట్టకున్నోళ్లంగా పాతాళంలోకే

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లిపై కేసులేయడంతో జగన్ పాతాళానికి కూరకుపోయారని యనమల పేర్కొన్నారు. జగన్ చేయి పట్టకున్నోళ్లంతా పాతాళంలోకేననన్నారు. ఆస్తుల వివాదం కాదు.. ఇది రాజకీయ ఆత్మహత్యలేనని తెలిపారు. చివరికి జగన్ సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని యనమల ఆరోపించారు. రష్మిలకు ఇచ్చిన రూ. 200 కోట్లు జగన్ కు ఎక్కడివి?, రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా.. ఐటీ, ఈడీ స్పందించట్లేదు..?, ఒక ఆర్థిక నేరస్థుడు 11 ఏళ్లుగా బెయిల్ పై ఉండటమేంటి..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది వైసీపీని వీడుతున్నారని రామకృష్ణుడు సూచించారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలేనని చమక్కరించారు. ఇవాళా కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు ఆయనపై సిద్ధంగా ఉన్నాయని యజమల జోస్యం చెప్పారు.