9 August, 2026 | 12:42 PM

పాఠశాలల్లో అభివృద్ధి పనుల పరిశీలన

26-05-2024 01:48 AM

వికారాబాద్, మే 25 (విజయక్రాంతి) : అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల్లో మహిళలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలపై ఉన్న నమ్మకంతో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌళిక సదుపాయాల కల్పన భాద్యతను ప్రభుత్వం వారికి అప్పగించినట్లు తెలిపారు.

పాఠశాలల్లో చేపట్టే పనులకు అంచనా మేరకు కొంత డబ్బులను ముందుగానే జమచేయడం జరిగిందన్నారు. పనులు పూర్తి నాణ్యతతో ఉండాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకొని మంచి పనులు చేయించాలన్నారు. నాణ్యత లోపం ఎక్కడ కనిపించకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు.