‘హై లైఫ్’ ఎగ్జిబిషన్‌కు రెడీ!
26-05-2024 01:45 AM
ఫ్యాషన్ రంగానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నది. దేశవ్యాప్తంగా ప్రముఖ డిజైనింగ్ కంపెనీలు ఇక్కడ ఫ్యాషన్ షోలు నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనిలో భాగంగా వచ్చే నెల 11, 12, 13వ తేదీల్లో హైటెక్ సిటీ నోవాటెల్ కన్వెన్షన్‌లో ‘హై లైఫ్’ ఫ్యాషన్ షో జరుగనున్నది. అందమైన మోడళ్లు షోకు హాజరుకానున్నారు. షోకు సంబంధించిన పోస్టర్లను శనివారం నిర్వాహకులు పలువురు మోడళ్లతో ఆవిష్కరింపజేశారు. వేడుకకు తరలివచ్చిన వారితో వేదిక కలర్‌ఫుల్‌గా మారింది.






