5 September, 2026 | 7:13 AM

మూపెన్ కుటుంబం వాటా పెంపు

05-09-2026 | 05:30am
  1. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌లో రూ.350 కోట్లతో మరో 0.57% కొనుగోలు
  2.    24.58 శాతానికి చేరిన మొత్తం వాటా

హైదరాబాద్, సెప్టెంబరు 4 (విజయక్రాంతి): ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌లో డాక్టర్ ఆజాద్ మూపెన్ కుటుంబం వాటా మరింత పెరిగింది. సుమారు రూ.350 కోట్లతో అదనంగా 0.57% వాటాను కొనుగోలు చేయడంతో, సంస్థలో మూపెన్ కుటుంబ వాటా 24.58 శాతానికి చేరింది. మూపెన్ కుటుంబానికి చెందిన యూనియన్ (మారిషస్) హోల్డింగ్స్ లిమిటెడ్ 46.09 లక్షల ఈక్విటీ షేర్లను టీపీజీ మద్దతున్న సెంటెల్లా మారిషస్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. సెప్టెంబరు 2న ఒక్కో షేరుకు రూ.760 చొప్పున ఈ లావాదేవీ జరిగింది.

మొత్తం లావాదేవీ విలువ రూ.350.34 కోట్లుగా ఉంది. తాజా వాటా కొనుగోలుతో డాక్టర్ మూపెన్ నేతృత్వంలోని ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌దీతిజిజిలో ప్రమోటర్ కుటుంబ వాటా మరింత బలపడింది. సమీకృత ఆరోగ్య సంరక్షణ వేదికగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ వృద్ధి సామర్థ్యం, వాటాదారులకు దీర్ఘకాలంలో స్థిరమైన విలువను అందించే అవకాశాలపై కుటుంబానికి ఉన్న నమ్మకాన్ని ఈ వాటా కొనుగోలు ప్రతిబింబిస్తోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు