2 August, 2026 | 8:59 AM

కరెంటు షాక్ తో తల్లి కూతుళ్లు మృతి..

29-10-2024 11:31 AM

విద్యుత్ షాక్ తో తల్లి కూతుర్లతో పాటు అనుమానాస్పదంగా కుక్క కూడా మృతి 

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్ లో తల్లి కూతుళ్లు కరెంటు షాక్ తో మృతి చెందారు. వీరితో పాటు కుక్క కూడా చనిపోయింది. వీరి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తెల్లవారుజామున తల్లి కూతుర్లు ఆత్మహత్య కలకలం రేపుతుంది.