కుటుంబ కలహాలతో తల్లీ కొడుకు ఆత్మహత్య

09-09-2026 | 05:10am

తాండూరు, సెప్టెంబర్ 8,(విజయ క్రాం తి): కుటుంబ కలహాలతో తల్లి కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మండ లం ఐనెల్లి లో మంగళవారం జరిగింది. సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి (CI Praveen Kumar Reddy) తెలిపిన వివరాల ప్ర కారం కోట బాస్పల్లి గ్రామానికి చెందిన శంకర్, తుల్జమ్మ (48) దంపతులు వీరి కుమారుడు నరేష్ (28) కు గత మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. నరేష్ భార్య కు టుంబ గొడవలతో పుట్టింటికి వెళ్ళింది.

అ యితే కాపురానికి రాకపోవడంతో వరం రో జుల క్రితం శంకర్ కోడలిని కాపురానికి తీసుకొని వచ్చాడు. తిరిగి నరేష్ ఆమెతో గొడవ పెట్టుకోవడంతో ఆమె వెళ్లిపోయింది. దీంతో తుల్జమ్మను, నరేష్ ను శంకర్ మందలించా డు. ఇంటి నుండి వెళ్లిపోయిన తల్లి, కొడుకు ఐనెల్లి గ్రామ సమీపంలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు