15 May, 2026 | 3:27 AM

రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి

15-05-2026 02:06 AM
  1. బైకును వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం
  2. సామతండాలో అలుముకున్న విషాదఛాయలు 

మిర్యాలగూడ, మే 14 : రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలో గురువారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం సాత్ తండ గ్రామానికి చెందిన మాలోతు సుజాత (40) కంటి పరీక్షలు చేపించుకోవడం కోసం  తన కుమారుడు చంటి (23) తో కలిసి ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణానికి చేరుకున్నారు.

ఆసుపత్రిలో చూపించుకుని తిరుగు ప్రయాణంలో కిష్టాపురం గ్రామం వద్దకు చేరుకోగా మిర్యాలగూడ నుండి దామరచర్ల వైపుకు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి బైక్ ను వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు.  బైక్ పై నుండి క్రింద పడిపోగా వారి మీద నుండి డీసీఎం వాహనం వెళ్ళింది. సుజాత అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన చంటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా మృతి చెందాడు. మాలోతు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి ఎన్ డి ప్రసాద్ తెలిపారు.