16 April, 2026 | 8:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఈ నెల 28న మోటార్ యూనియన్ల విలీన సభ

26-03-2025 06:28 PM

ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): మార్చి 28న ఇల్లెందులో జరుగు ఐఎఫ్టియు అనుబంధ మోటార్ యూనియన్ల విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు, తెలంగాణ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.రాసుద్దీన్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం ఇల్లెందు సిహెచ్పి లో కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో, బస్టాండ్ సెంటర్లో ఆటో కార్మికులతో ఏర్పాటు చేసిన ప్రచార మీటింగ్ లలో వారు పాల్గొని మాట్లాడారు.

మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 2019 మోటార్ వెహికల్ చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం ఆటో కార్మికులకు12వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, ఆటో మోటార్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డి.మోహన్ రావు నాయకులు మోరె వెంకటేశ్వర్లు, పి.రమేష్, విజయ్, బాలు, రాజు,  ప్రశాంత్, వినోద్, భానోత్ రాజు, బి.శ్రీను, మేఘ్య, సాదిక్, నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.