29 June, 2026 | 12:44 PM

ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

29-06-2026 11:56 AM

కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపుకు తరలించిన పోలీసులు 

కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మూర్లో సోమవారం చేపట్టనున్న హిందు ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డు కోవడంతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు పైడి రాకేష్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయానికి తరలించారు.