calender_icon.png 20 February, 2026 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడదాకా ఉద్యమమే శ్వాసగా!

15-02-2026 12:00:00 AM

తాళ్లపల్లి సురేందర్ :

నేడు భూపతి కృష్ణమూర్తి వర్ధంతి :

‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మరణం నా దరి చేరదు’ అని సంకల్ప బలాన్ని చాటిన ధీశాలి, నిస్వార్థ నాయకుడు భూపతి కృష్ణమూర్తి. ఏ పదవులు ఆశించకుండా సొంత ఆస్తులను సైతం ఉద్యమాల కోసం ధారపోసిన త్యాగశీలి ఆ యన. అభిమానులు ‘తెలంగాణ గాంధీ’గా పిలుచుకొనే ఆయన జీవితమంతా పోరాటాలమయమే. భావితరాలకు ఆయనొక ఆద ర్శప్రాయం. ఎక్కడ ఉద్యమం జరిగిన అక్కడ భూపతి కృష్ణమూర్తి తప్పకుండా ఉంటారు.

ఉద్యమమే ఊపిరిగా జీవించిన వ్యక్తిత్వం ఆయనది. స్వాతంత్య్ర పోరాటం, రజాకార్ల నిరంకుశ పాలన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని ఉద్య మాల అవశ్యకతను వివరించి ప్రజలతో మ మేకమయ్యారు. తనకున్న వందలాది ఎకరాల భూమిని ఉద్యమ ఖర్చుల కోసం ఊ డ్చివేసి చివరకు ఆయన చివరి రోజుల్లో అద్దె ఇంట్లోనే అంతిమ శ్వాస విడిచారు. దీన్నిబట్టే ఆయన నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థాన్ని అర్ధం చేసుకోవచ్చు.

హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూ రులో భ్రమరాంభ, రాఘవులు దంపతులకు 1926 ఫిబ్రవరి 21న భూపతి కృష్ణ మూర్తి జన్మించారు. ప్రాథమిక విద్యను ము ల్కనూరులో పూర్తి చేసి అనంతరం వరంగల్‌కి వెళ్లారు. పదహారేళ్ల  ప్రాయంలోనే కనక లక్ష్మితో కృష్ణమూర్తికి వివాహం జరిగింది. మొదట తన గురువులు అలిగిరెడ్డి రాజారెడ్డి, చెన్నారెడ్డి, గన్ను బుచ్చయ్యల ప్రభావం తో కృష్ణమూర్తి తానెంటో తెలుసుకున్నారు. అద్భుతమైన క్రమశిక్షణ, ఆధ్మాత్మిక చింతన, దేశ భక్తి, నిస్వార్థ ప్రజాసేవ.. ఇవే తన తత్వానికి సరిపడే కృత్యాలుగా ఆత్మావలోక నతో గ్రహించారు. 

మహాత్మునితో అడుగులు..

జాతిపిత మహాత్మా గాంధీతో కలి సి భూపతి కృష్ణమూర్తి భారత స్వా తంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గాంధీయవాది అయిన కృష్ణమూర్తి 1944లో వార్ధాలోని గాంధీ ఆశ్రమంలో పది రోజులు గాంధీజీతో గడిపారు.  స్వాతంత్ర సంఘ గ్రామం లో చురుకైన పాత్ర పోషించారు. స్వా తంత్య్రం వచ్చాక కూడా ఆయన తన పోరాటాన్ని ఆపలేదు. రజాకార్ల దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. 1953--54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వరంగ ల్‌కు వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ర్టం కోసం కొట్లాడి వారికి తన గళాన్ని గట్టిగా వినిపించారు.

1969లో ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనూ ఆయనది కీలకపాత్ర. తనకున్న సొంత ఆస్తులు అమ్మేసి ఉద్యమానికి ఊపిరి పోసిన నిస్వార్థ నాయకుడు. 1943 సంవత్సరంలో వరంగల్‌లో తన మిత్రులతో కలిసి నేషనల్ క్లబ్ ను స్థాపించి దానికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తన రాజకీయ గురువు అయిన హయగ్రీవ చారి అధ్యక్షుడిగా ఉన్న వరంగల్ పట్టణ కాంగ్రెస్‌కు కృష్ణమూర్తి 1941 నుండి 46 వరకు కోశాధికారిగా పనిచేసి అధిష్టానం ప్రసంశలు అందుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆయన విశేషంగా కృషి చేశాడు. 1953 నుంచి చాలా ఏళ్లపా టు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా, వరంగల్ జిల్లా ఆ ర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా సేవలందించారు. 

ఉద్యమ వ్యూహ రచనలు..

వరంగల్‌లో పలు విద్యాసంస్థల ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించారు. 1956లో ముల్కనూరు సహకార సంఘ ఏర్పాటులో అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి తదితరులతో కలిసి రైతులను మమేకం చేశా రు. 1969 ఫిబ్రవరి 28న యువకులు, మే ధావి వర్గాలతో కలిసి హైదరాబాదులో తెలంగాణ ప్రజా సమితిని స్థాపించారు. మర్రి చెన్నారెడ్డి పార్టీని వీడిన త ర్వాత తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షునిగా వ్యవహరించి అన్ని తానై ముందుకు నడిపారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ప్రొఫె సర్ జయశంకర్‌తో అనేక ఉద్యమాల్లో పాలుపంచుకోవడమగాక ఉద్యమానికి సంబంధించి అనేక వ్యూహ రచనలు చేశారు. 

1970---74 వరకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. 1972లో  ప్రజాసమితి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1977లో జనతా పార్టీ ప ట్టణ అధ్యక్షునిగా పనిచేసి, 1978  లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పో టీ చేసినప్పటికీ మరోసారి ఓటమే ఎదురయ్యింది. 1980లో బీజేపీలో చేరిన కృష్ణమూర్తి 1983 ఎన్ని కల్లో స్వల్ప తేడాతో  ఓటమి పాలయ్యారు.

1983లో టీడీపీ తరఫున టికెట్ ఇచ్చేందుకు పార్టీ ఎంపిక చేసినప్పటికీ కృష్ణమూర్తి సున్నితంగా తిరస్కరించారు. 1986లో ష ష్టి పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వైశ్యరత్న’ బిరుదుతో సత్కరించారు. ఆయన పోరాట పటిమ, సేవ దృక్పథం, ఉద్యమ నేపథ్య న్నీ చూసిన ప్రజా సంఘాలు, అప్పటి జేఏసీ చైర్మన్ భూపతి కృష్ణమూర్తికి తెలంగాణ గాంధీ, ప్రజా బంధు బిరుదును ప్రధానం చేశారు. 1990 ఫిబ్రవరి 17 తెలంగాణ ప్ర జా సమితిని తిరిగి ప్రారంభించి దానికి అధ్యక్షునిగా కొనసాగారు. 

తెలంగాణ గాంధీ..

198ంల్లో బహుముఖంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తీవ్ర ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, తనదైన పంథాలో ఉద్య మంలో దూసుకుపోతున్న కృష్ణమూర్తి నిస్వా ర్థ పోరాట పటిమకు కృతజ్ఞతాపూర్వంగా తెలంగాణ ప్రజలు వరంగల్ వేదికగా ప్రముఖులతో కలిసి ఒక కమిటీగా ఏర్పడి కృష్ణ మూర్తిని ‘తెలంగాణ గాంధీ’ అని పిలుచుకున్నారు. కడదాకా తెలంగాణ కోసమే జీవిం చి, తెలంగాణనే స్వప్పించి, తెలంగాణనే శ్వాసించారు భూపతి కృష్ణమూర్తి.

చివరకు జూన్ 2, 2014న వేలాది అమరవీరుల ప్రాణత్యాగాలతో సిద్ధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో భూపతి కృష్ణ మూర్తి చిరకాల వాంఛ నెరవేరింది. తెలంగాణ వచ్చిందన్న తృప్తితో జీవితం గడిపిన భూపతి కృష్ణమూర్తి మరుసటి ఏడాది ఫిబ్రవరి 15న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అతని సుదీర్ఘ, నిరంతర ‘తెలంగాణ ఆవిర్భావ కాంక్షను’ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభు త్వ లాంఛనాలతో అంత్యక్రియలను సగౌరవంగా నిర్వహించింది.

ఒక వ్యక్తి జీవితాంతం తాను లక్ష్యించిన గమ్యాన్ని చేరడానికి పడ్డ తపన, చేసిన తపస్సు, మనిషికి అంతిమంగా తప్పక సాఫల్యతను ప్రసాదిస్తుంది. తెలంగాణ గాంధీగా సుపరిచితులైన భూపతి కృష్ణ మూర్తి నిస్వార్థ జీవితం రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని నిరంతరం వినిపిస్తూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 వ్యాసకర్త సెల్: 9440715635