Phone Tapping Case: కేసీఆర్‌పై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్( phone tapping case) అంశంలో సిట్ విచారణకు పిలిచారని చెప్పారు. 2023 జులైలో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారని వివరించారు. 2023లో తాను టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ గా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి టీమ్(Revanth Reddy's team) సభ్యుడిగా ఉన్నందుకు తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పుకొచ్చారు.
హరీశ్ రావు ఒప్పుకుంటారో లేదో కానీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చామల స్పష్టం చేశారు. ట్యాపింగ్ వల్లే హరీశ్ రావు తన డ్రైవర్, పీఏను మార్చుకున్నారని సూచించారు. కవిత తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారని తెలిపారు. అధికార దుర్వినియోగం చేయడంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ను మించిన వారు లేరని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్(Special Investigation Team) అధికారులు చెప్పింది ప్రజలు వెంటే ఆశ్చర్యపోతారని ఆయన వెల్లడించారు. వేల ఫోన్లు ట్యాప్ చేశారు, ప్రైవేట్ సంభాషణలు విన్నారని తెలిపారు.






