డబ్బులు కేంద్రానివి.. సోకులు రాష్ట్ర ప్రభుత్వనివా?

26-09-2026 | 05:20am

నాకు తెలియకుండా ప్రారంభోత్సవాలు, నిర్ణయాలా?

ఎంపీ రఘునందన్‌రావు 

మెదక్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పైసలు కేంద్రానివి.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా.. ఎంపీకి తెలియకుండా ప్రారంభోత్సవాలు, నిర్ణయాలా అని అధికారులపై మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద జిల్లాకు మంజూరైన నిధులు, చేపట్టిన పనులు, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనులు, పెండింగ్‌లో ఉన్న పను ల వివరాలను ఎంపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాలఅమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, పాఠశాలలు, అం గన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చే యాలని ఎంపీ సూచించారు. రామ్ జీ బి వి పథకం ద్వారా చేపడుతున్న పనులు నాణ్య తా ప్రమాణాలతో ఉండేలా చూడాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో చేప ట్టే అభివృద్ధి పనులు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేలా ప్రణాళికాబ ద్ధంగా ఉండాలని సూచించారు. విద్యా రం గంపై సమీక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌ లిక వసతులు, విద్యార్థుల హాజరు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాల ను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభు త్వ ఆసుప త్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా గ్రామీణ  ప్రజలకు వైద్య సేవలు సులభంగా అందుబాటులో ఉం డేలా చూడాలన్నారు. తాగునీటి పథకాల పురోగతిని సమీక్షించిన ఎంపీ, ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందేలా అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శా ఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు లక్ష్యాలను చేరుకుంటాయని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథ కాల ద్వారా జిల్లాకు అందుతున్న నిధు లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ అధికారుల సమన్వ యంతో పథకాలు ప్రజలకు అందేలా చూడలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎఫ్‌ఓ జోజి, జిల్లా స్థాయి అధికారులు, దిశా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు