636 పెన్షన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన: ఎంపీడీవో ఆనంద్

16-09-2026 | 08:32pm

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో నూతనంగా  పెన్షన్(pension)ల కోసం దరఖాస్తు చేసుకున్న 636  మంది లబ్ధిదారుల దరఖాస్తులపై బుధవారం ఎంపీడీవో ఆనంద్(MPDO Anand), సీనియర్ అసిస్టెంట్ భాను ప్రకాష్ లు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట, బోర్లమ్ క్యాంప్, ఇబ్రహీంపేట్ రాంపూర్ పోచారం తదితర గ్రామాల్లో దరఖాస్తుదారులను నేరుగా కలిసి వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే పెన్షన్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులను సంప్రదించి అవసరమైన ఒరిజినల్ పత్రాలతో వెరిఫికేషన్‌కు సహకరించాలని ఎంపీడీవో ఆనంద్ కోరారు.

మరిన్ని వార్తలు