ఉపాధి హామీ పనులపై ఎంపిడిఓ అకస్మాత్తుగా తనిఖీ
గ్రామ అభివృద్ధికి ఉపాధి పనులు కీలకము
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని రాఘవపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు.గ్రామ సర్పంచ్ నార్ల గంగమణి మల్లేశంతో కలిసి ఉపాధి హామీ పనుల స్థితిగతులను సమగ్రంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో,పారదర్శకంగా కొనసాగుతున్నాయనీ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా కూలీల హాజరు పట్టికను పఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఉపాధి హామీ పనులు ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత కొలతల ప్రకారం ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు.
ప్రతి పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం చాలా ముఖ్యమని,పనులు నిర్లక్ష్యంగా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూలీలకు కేటాయించిన పనులను సమయానికి పూర్తి చేయడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. అలాగే కూలీల హాజరు శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ మల్లవ్వకు ఆదేశించారు. గ్రామంలో ఉన్న అర్హులైన ప్రతికూలీ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కూలీలకు సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ పనులు కీలకమని, ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడతాయని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నార్ల గంగమణి మల్లేష్,ఫీల్డ్ అసిస్టెంట్ మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.






