28 February, 2026 | 10:47 PM

దరోగపల్లి అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసిన ఎంపీవో

28-02-2026 06:34 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): మండలంలోని దరోగపల్లి గ్రామములోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీవో మహేందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ... పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం అందించే సమయంలో పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో సమయపాలన పాటిస్తూ సేవలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. తనిఖీ అనంతరం కేంద్ర నిర్వహణపై వివరాలు తెలుసుకొని అవసరమైన మార్పులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ పంచాయతీ సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి–హరీష్ పంచాయతీ సెక్రటరీ మధుకర్ పాల్గొన్నారు.