28 February, 2026 | 10:31 PM

బస్వాపూర్‌లో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశం

28-02-2026 06:37 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపీసీసీ  ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీ, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలతో పేద కుటుంబాలకు సొంత ఇళ్లు అందించడం అభినందనీయమని నేతలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహంగా, ప్రశాంతంగా ముగిసింది.