30 May, 2026 | 2:06 AM

హైదరాబాద్‌లో అలీప్-2026

30-05-2026 01:31 AM

మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ కనెక్ట్ కార్యక్రమం

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రిన్యూఅర్స్ ఆఫ్ ఇండియా (అలీప్) ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ప్రగతినగర్, అలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఎంఎస్‌ఎంఈ కనెక్ట్ కార్యక్రమా న్ని విజయవంతంగా నిర్వహించింది. భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ కార్యదర్శి భరత్ ఖేరా పాల్గొన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, మహిళా స్వయం సహా యక సంఘాలు, పరిశ్రమ, ఇన్నోవేషన్ రం గాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. భరత్ ఖేరా అలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఇన్క్యుబేషన్, తయారీ, శిక్షణ, స్టార్టప్ మద్దతు కేంద్రాలను సందర్శించారు. వీటిలో గార్మెంట్స్ హబ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయోడిగ్రేడబుల్ టెక్నాలజీ యూనిట్లు, డిజిటల్ స్టూడియో, అలీప్ సిడ్‌బీఐ ఎంఎస్ ఎంఈ ఫెసిలిటేషన్ సెంటర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ యూనిట్లు, చైల్ కేర్ సెంటర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో జ్యూట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలీప్ ఇండస్ట్రియల్ పార్కులు, క్లస్ట ర్లు, ర్యాంప్ ప్రాజెక్టుల ప్రజెంటేషన్ నిర్వహించారు. అర్హత పొందిన జెడ్ సర్టిఫైడ్ ఎంఎస్ ఎంఈలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్లకు గ్రాంట్ ఫండింగ్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మహి ళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ, సిడ్‌బీఐ పథకాల సమాచార స్కీమ్ సాథి వాట్సాప్ ఏఐను ప్రారంభించారు.

కార్యక్రమంలో మెర్సీ ఎపావో, జాయింట్ సెక్రటరీ, ఎంఎస్‌ఎంఈ, నిఖిల్ చక్రవర్తి, డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్, తెలంగాణ, డా. అశుతోష్ ఎ. ముర్కుటే, డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్‌ఎంఈ, మధుకర్ బాబు, జాయింట్ డైరెక్టర్, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్, తెలంగాణ, సి.ఎస్. ఎస్. రావు, జాయింట్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఆఫీస్, ఎంఎస్‌ఎంఈ, సురేష్ కుమార్, జనరల్ మేనేజర్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, హైదరాబాద్, వేమూరి చంద్రమౌళి, జనరల్ మేనేజర్, సిడ్‌బీఐ, హైదరా బాద్, మనోజ్ కుమార్, డైరెక్టర్, కేవీఐసీ, డా. విజయ కృష్ణ కాంత్, ప్రాజెక్ట్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, భా రత ప్రభుత్వం పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను మరింత బలోపేతం చేయా లనే నిరంతర కృషికి ఈ కార్యక్రమంలో అలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి తెలిపారు.