విజయవంతమైన లెగసీ మళ్లీ ప్రారంభమైంది. డిస్ని వారి ‘ముఫాసా’ ది. లయన్ కింగ్ ఈ సంవత్సరం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఫ్రైడ్ లాండ్స్‌లో ముఫాసా ఎదుగుదల ఎలా జరిగింది అనేది ఎక్స్‌ప్లోర్ చేయడమే ఈ చిత్ర కథాంశం. ప్రపంచవ్యాప్తంగా ‘ది లయన్ కింగ్’ సినిమాకు అభిమానులున్నారు. 1994లో వచ్చిన యానిమేషన్ సినిమా నుండి ఈ పరంపర మొదలైంది. ఆ మానియా ఎన్నాళ్లునా ఎవర్ గ్రీన్‌గా వుండటంతో మేకర్స్ రియలిస్టిక్ 3డి యానిమేషన్‌లో ఇంకోసారి చిత్రీకరించి 2019లో విడుదల చేశారు.
అది పెద్ద కూడా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ‘కింగ్’ ముఫాసా కథని బేస్ చేసుకుని ప్రైడ్ లాండ్స్‌లో ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనే అంశంతో రూపొందిన ‘ముఫాసా’ చిత్రాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా, దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి బ్యారీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకులకి రియలిస్టిక్ ఫీల్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్‌కు రియల్ కంప్యూటర్ జనరేటేడ్ ఇమేజరిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.