calender_icon.png 22 May, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములకలపల్లి కుమారి పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

22-05-2025 12:49:46 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

 మునగాల మే 21:  సూర్యాపేట జిల్లా మునగాల ములకలపల్లి కుమారి పార్టీకి చేసిన సేవలు మరువలేని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంలు అన్నారు. బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు ములకలపల్లి రాములు సతీమణి ములకలపల్లి  కుమారి భౌతిక ఖాయం పై పూలమాల వేసి జోహార్లు అర్పించారు.

అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న వారు మాట్లాడు తూ ములకలపల్లి రాములు పార్టీ నాయకుడిగా ఎదగడంలో కుమారి పాత్ర మరువలేనిదని అ న్నారు. పార్టీ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా తన భర్త రాములు ఎన్నికై ప్రజా సేవలో ఉన్నప్పు డు ఆమె ఎంతో ఓర్పుగా ఉంటూ అన్ని విధాలుగా ఆయనకు సహాయ, సహకారాలు అందించారని అన్నారు. ఇంటికి వచ్చే నాయకులకు, కార్యకర్తలను ఆప్యాయతగా పిలుస్తూ వారికి భోజ నాలు పెట్టే వారన్నారు. భర్త పార్టీ పనిలో ఉండగా ఆమె కుటుంబ బాధ్యతలు చూస్తూ పిల్లలను పెంచిపోషించిందని అన్నారు.

ఈ అంతిమ యాత్రలో సిపిఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారాములు,డిజి నరసింహారావు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి,బండారు రవికుమార్ ఎండి జహంగీర్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలాబ్ బాబు, ఆర్ వెంకట రాములు,ప్రసాద్,నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొన్నారు.