calender_icon.png 22 May, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం

22-05-2025 12:51:35 AM

ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ, మే 21: కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతల్ పహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని  మంత్రియ తండాలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బుధవారం దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ  క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు.క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలంపల్లి నర్సింహా, ఉట్కూరి వేమన్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, మాడుగుల యాదగిరి, రామవత్ రవి నాయక్,లాలు నాయక్, రాణి రాజు నాయక్, భాస్కర్ నాయక్ గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.