వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్..

16-09-2026 | 06:07pm

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఈ సంవత్సరం వర్షాలు పడకపోవడంతో చాకలి గిద్దెలో నీరు లేకపోవడంతో యాదగిరిగుట్టలోని నల్లచెరువులో వినాయక నిమజ్జనంను చేసేందుకు ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్(Gundlapalli Vani Bharat Goud) పరిశీలించారు. బుధవారం యాదగిరిగుట్ట నల్ల చెరువు వద్ద వినాయక నిమజ్జనము ఏర్పాట్లు పరిశీలించి తగు సూచనలు చేయడంతో పాటు, నిమజ్జనమునకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడవలెనని అధికారులకు ఆదేశించడం జరిగినది.

సాయిబాబా గుడి వద్ద నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.ఈ కార్యక్రమములో  వైస్ చైర్ పర్సన్ బరిగె రమ్య రాం చందర్ ,  గౌరవ కాన్సిల్ సభ్యులు  బోడ రాధ ,బూడిద మధు, కాటబత్తిని  స్వప్న , కర్రె మాధవి , పెలిమెల్లి లావణ్య ,పెరబోయిన సత్యనారాయణ యాదవ్, సాదు నేని ధనలక్ష్మి, ముక్కెర్ల మల్లేష్, బబ్బూరి శ్రీదర్,  మరియు కో అప్సన్  సభ్యులు గౌలికర్  అరుణ, బండి జంగమ్మ, రహీమా,ఉస్మాన్ షరిఫ్ ,  కార్యాలయ సిబంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు