మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ కు ఘన సన్మానం
01-03-2026 02:59 PM
కుమ్రం భీంఅసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ ను ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మోయిన్ ఘనంగా సన్మానించారు. ఎండీ అహ్మద్‌కు పూలమాల వేసి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోయిన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మైనార్టీ ముస్లిం వర్గానికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు సూఫియాన్ తదితరులు పాల్గొన్నారు.




