27 August, 2026 | 10:55 PM

రాజు కుటుంబానికి మున్నూరు కాపు సంఘం చేయుత

27-08-2026 09:52 PM

రూ.10 వేల ఆర్థిక సాయం

గణపురం,(విజయక్రాంతి): ధర్మారావుపేట గ్రామానికి చెందిన తోట రాజు ఇటీవల మృతి చెందగా కుటుంబాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కటకం రాజు ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక  సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తోట రాజు కుటుంబానికి తమ సంఘం అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో రౌతు అశోక్, బాపని రాజయ్య, కన్నా సాంబయ్య, కన్నా కొమురయ్య, గందె ప్రకాష్, గండు శ్రీధర్‌తో పాటు మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.