‘మూసీ’ కూల్చివేతలు నిలిపివేయాలి

11-09-2026 | 05:05am
  1. సహజ నదీ వ్యవస్థ పునరుద్ధరణకే ప్రాధాన్యం ఇవ్వాలి
  2. సీనియర్ సంపాదకుడు కె శ్రీనివాస్
  3. ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బాధితుల ధర్నా 

ముషీరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మూసి నది(Musi River) పరిధిలో భవనాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం మూసీ జన్ ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌(Indira Park Dharna Chowk)లో మహాధర్నా కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఎడిటర్ డాక్టర్ కె శ్రీనివాస్(Senior Editor Dr. K. Srinivas) మాట్లాడు తూ.. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు(Warnings) లేకుండా మూసీ నదిలోకి నీటిని విడుదల చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని  ఆరోపించారు.

గతంలో గ్రామీణ ప్రాంతా(Rural area)ల్లో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరిగిందని, ప్రస్తుతం అదే విధానం నగరాలకు విస్తరిస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు(Musi Project)తో ప్రజలకు ప్రయోజనం లేదని, కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మూసి జన్ ఆందో ళన్ ప్రతినిధులు మాట్లాడుతూ  సహజసిద్ధమైన నదీ వ్యవస్థ పర్యావరణ పునరుద్ధరణ, నదీ పరివాహక ప్రాంత ప్రణాళికను చేపట్టాలని డిమాండ్ చేశారు. వాణిజ్య కాంక్రీటీకరణ, సామూహిక నిర్వాసితాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీర్)ను ప్రాంతీయ భాషల్లో ప్రచురించి అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాలని, జీవో 921ను రద్దు చేసి సామాజిక ప్రభావ అంచనా నిర్వహించాలని కోరారు. కొత్త ని ర్మాణాలను నిలిపివేయడంతో పాటు మూ సీ ఒడ్డున రోడ్లు, ప్రాజెక్టు కింద వంతెనలు నిర్మించరాదన్నారు. కాలుష్య కారకాల వద్దే నియంత్రణ చర్యలు చేపట్టాలని, మూసీ నదీ పరివాహక ప్రాంతానికి ప్రత్యేక అథారిటీ ఏ ర్పాటు చేయాలని, గతంలో మూసీ పునరుద్ధరణకు ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ నిర్వ హించాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభు త్వం ఎలాంటి కూల్చివేతలు లేకుండా చేపట్టి ందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేసి దాన్నే మూసీ శుద్ధికరణ అని చె బుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమం లో హెచ్‌ఎఆర్‌ఎఫ్, ఎన్‌ఏపీఎం, డీబీఎఫ్, పీఓడబ్ల్యూ, మహిళా ట్రాన్స్‌జెండర్ జేఏసీ, ఛత్రి, కార్సిర్డ్, సీఎఫ్, ఈజెఎఫ్, సీఎంఎస్, జేవీవీ సంధ్య, సజయ, జి. శంకర్ తదితర ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు