calender_icon.png 15 June, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ముస్లిం నేతలు

27-05-2025 05:50:40 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు వాఅలైహి వసల్లం పై యూట్యూబ్ చిలుక ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ(Wakf Board Conservation Joint Action Committee) కన్వీనర్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఈ మేరకు ముస్లిం పెద్దలతో కలిసి మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇస్లామును అవమాన పరుస్తూ చిలుక ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజ మనోభావాలను గాయపరుస్తున్నాయన్నారు. తక్షణం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్, ముఫ్తి ఆలంగిర్, హఫీజ్ అబ్దుల్ హమీద్, సయ్యద్ అహమ్మద్, రఫీ, మహమ్మద్ అలీ ఖాన్, షేక్ చాంద్, సాబీర్ హుస్సేన్, ఇర్ఫాన్, షకీల్ షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.