గణేష్ నిమజ్జనంలో డీజేలకు నో
డీజే నిర్వాహకులను బైండోవర్ చేసిన ముత్తారం పోలీసులు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ముత్తారం,(విజయక్రాంతి) గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ముత్తారం పోలీసులు(Muttharam police) ముందస్తు చర్యలు చేపట్టారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్(DJ Sound Systems) వినియోగించరాదని డీజే నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా ముత్తారం మండల పరిధిలోని డీజే నిర్వాహకులను పోలీసులు బైండోవర్ చేశారు. నిమజ్జన కార్యక్రమాల సమయంలో డీజేలను వినియోగించరాదని, పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వారికి సూచించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, యువకులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతమైన, సురక్షిత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్‌ఐ కోరారు.