బీఎస్‌ఎన్‌ఎల్ రాగి తీగల చోరీ ముఠా అరెస్టు

16-09-2026 | 12:39am

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో కేబుల్ చోరీ ముఠా ను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది సభ్యుల ఈ ముఠా చేసిన దొంగతనాలను అత్యంత చాకచక్యంగా చేదించారు. ముఠా అరెస్టు వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ (Bellampalli Rural Police Station)పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్(BSNL ) టవర్లకు సంబంధించిన రాగి తీగలను ముఠా చోరీ చేస్తున్నది. కేబుల్ దొంగతనాలపై బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్(Bellampalli ACP Kiran Kumar) ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సీసీఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టాయి.

దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర సమాచారాన్ని అందిపుచ్చుకొని బీఎస్‌ఎన్‌ఎల్ రాగి తీగల చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించారు. భారీ కేబుల్ దొంగతనాల. ముఠా సభ్యులు ఉప్పరి సంపత్, గొమాసా అజయ్ కృష్ణ ,మారినేని రాజ్‌కుమార్ గొమాసా అనుకృష్ణ, దుర్గం శేఖర్, దుర్గం అంకులు, పాండి రాజ్‌కుమార్,సాంబోజు రమేష్ లను అరెస్టు చేశారు. ఈ కేసును  సీసీఎస్ ఏసీపీ కె. రవీందర్,సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ టి.గోపీ, బెల్లంపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. హనోక్,సీసీఎస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావు, తాల్లగురిజాల సబ్‌ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ,ఇతర సబ్‌డివిజన్ పోలీస్ సిబ్బంది,సీసీఎస్ ప్రత్యేక బృందం సమన్వయంతో కృషి చేశారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరిపర్చి రిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు