12 June, 2026 | 5:33 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

నటి త్రిషకు నా క్షమాపణలు

17-02-2026 01:26 AM

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్

చెన్నై, ఫిబ్రవరి 16: ‘టీవీకే అధ్యక్షుడు, తమిళ సినీ స్టార్ విజయ్‌కి రాజకీయాలపై ఏమాత్రం అవగాహ న లేదు. ఆయనకున్న అనుభవం సున్నా. రాజకీయాల్లో ఏదైనా సాధించాలనుకుంటే ముందు విజయ్ తన ఇల్లు దాటి బయటకు రావాలి. అంతకంటే ముందుగా నటి త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. ఆ పని చేస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తా యి’ అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయంగా రాష్ట్రంలో పెద్ద దుమారం రేపాయి. వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ నుంచి, మహి ళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని తమిళ సమాజం దుమ్మెత్తి పోసింది. దీంతో నైనార్ నాగేంద్రన్ సోమవారం నటి త్రిషకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తన వ్యాఖ్యల ను ఎవరి మనసునైనా బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని ఆయన స్పష్టం చేశారు.