24 April, 2026 | 12:21 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది

21-03-2025 12:00 AM

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో దక్కిన గౌరవంపై స్పందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఘన సత్కారం దక్కింది. అదే సమయంలో యూకేకు చెందిన బ్రిడ్జి ఇండియా అనే ప్రఖ్యాత సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు చిరంజీవి. పలువురు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, దౌత్యవేత్తలతో  సహా అనేక ప్రముఖ వ్యక్తుల సమక్షంలో చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్‌లోని కొందరు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అండర్ సెక్రటరీలు, దౌత్యవేత్తల చే గౌరవించబడటం గౌరవంగా భావిస్తున్నాను. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.

సభ్యులు నాపై గౌరవ భావాన్ని చూపిస్తూ మాట్లాడిన మాటలకు నేను ధన్యుడిని. బ్రిడ్జి ఇండియా బృందం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవటం నన్నెంతగానో ఉత్సాహపరిచింది” అని రాసుకొచ్చారు.  ‘మాటలు సరిపోవు. అద్భుతమైన ప్రేమాభిమానాలను చూపించే అభిమానులు, రక్తదాతలు, నా సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ నా ప్రయాణంలో ఎంతగానో సహకరించినవారు, నేను మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు.